అదిలాబాద్ అర్బన్: బుగ్గారంలో కొత్త గ్రంథాలయాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం బుగ్గారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. యువత ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని, చదువుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.