చందర్లపాడు వెలదికొత్తపాలెంలో సార్వత్రిక ఎన్నికలపై ప్రజలకు పోలీసుల అవగాహన, ఫ్లాగ్ మార్చ్
Nandigama, NTR | Apr 24, 2024 చందర్లపాడు వెలదికొత్తపాలెంలో సార్వత్రిక ఎన్నికలపై నందిగామ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా సహకరించాలని ఎస్సై ధర్మరాజు కోరారు. వివాదాలు జోలికి వెళ్లవద్దని, ప్రచారానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.