శ్రీశైలం: ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ మరియు తల సేమియా దినోత్సవం
నంద్యాల జిల్లా ఆత్మకూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుకుంద చెంచు గూడెంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి గూడెం ప్రజలకు భోజనాలు, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షురాలు రత్న రాధికా, డిప్యూటీ తహసీల్దార్ ఆంజనేయులు, చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ మక్బుల్ బాషా, కమిటీ సభ్యుడు చిన్న శివయ్య, జనరల్ సెక్రటరీ శ్రీను, సెక్రటరీ గోపాల్, కోశాధికారి నాగేష్ పాల్గొన్నారు.