మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణ..
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ (డి ఆర్ ఎం) గోపాల కృష్ణ,కమిషన్ అఫ్ రైల్వే సేఫ్టీ (సీ.ఆర్.ఎస్) కవిత,13 బ్రాంఛీలప్రిన్సిపల్ హెచ్.డీ.ఓ లు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే 3వ రైలు నిర్మాణపు పనులను మంగళవారం మధ్యాహ్నం 12:00 లకు పరిశీలించారు. ప్రత్యేక రైలులో మహబూబాబాద్ స్టేషన్ చేరుకుని 3వ ఫ్లాట్ ఫారం,సేఫ్టీ రూమ్, లను పరీశీలించారు. అనంతరం రైల్వే గేట్ ట్రాక్ కు అమర్చిన థిక్ వెబ్ స్విచ్( టి డబ్ల్యూ ఎస్) పాయింట్ పని తనాన్ని ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత రైల్వే ట్రాక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను పరిశీలించారు