శ్రీశైలం: వెలుగోడు మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. వెలుగోడు మండలం రేగడగూడూరు, పరమటూరు గ్రామాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. క్వింటాలకు రూ.3699 కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ పంటకు సరైన ధర లభించడం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.