నారాయణపేట్: నారాయణపేట నుండి కోయిల కొండ మీదుగా మహబూబ్ నగర్ కు బస్సు పునరుదించాలి: సిపిఎం
నారాయణపేట నుండి కోయిల కొండ మీదుగా మహబూబ్ నగర్ వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని నారాయణపేట బస్సు డిపో మేనేజర్ లావణ్య కు శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ నారాయణపేట నుండి కోయిల కొండ మీదుగా మహబూబ్ నగర్ వెళ్ళుటకు బస్సు మళ్ళీ పునరుదించారని అన్నారు. గతంలో నారాయణపేట నుండి అమ్మి రెడ్డి పల్లి బొమ్మను పాడు అభంగపూర్ కోటకొండ వింజమూరు కోయిల కొండ మీదుగా మహబూబ్ నగర్ కు బస్సు వెళ్లేదని ఈ మధ్యకాలంలో బస్సును ఆపి వేశారని, ఆ యొక్క బస్సును పునరుద్దించినచో ఇక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కోరారు.