శ్రీశైలం: సంగమేశ్వరం సమీపంలోనికృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం. వేసవిలో పోలీసులకు సవాలుగా మారుతున్న గుర్తుతెలియని శవాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపంలోని కృష్ణ నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక జాలర్ల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించడంతో హత్య చేసి నదిలో పడవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి ఏటా వేసవికాలంలో కృష్ణ నదిలో ఇలాంటి గుర్తుతెలియని మృతదేహాలు లభించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.