కనిగిరి: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి ఐసిడిఎస్ కార్యాలయంలో బాల్యవివాహా విముక్తి భారత్ 100 రోజుల కార్యాచరణలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలపై శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా జరిమానా, జైలు శిక్ష ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ పరిధిలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 100, 181 కు తెలపాలన్నారు.