కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలో ఘనంగా దసరా ఉత్సవాలు మహిషాసుర సంహారం వైభవం గా దుర్గామాత నిమజ్జనం
జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలో,దసరా పండుగను పురస్కరించుకొని దుర్గామాత నిమజ్జన వేడు కలను,గురువారం అంగరంగ వైభవంగా మేళ తాళాలు, డీజే పాటల తో శోభయాత్ర ఘనంగా నిర్వహిం చారు, శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులపాటు ఘనంగా నిర్వహించారు,చెడును దహించి వేసి గ్రామం సుభిక్షంగా ఉండాలని,ఈ ఊరేగింపులో ఏర్పాటుచేసిన మహిషాసు ర సంహార ఘట్టాన్ని టపాసులతో అమర్చి మహిషాసురు డి దిష్టిబొమ్మను దుర్గామాత కాల్చే ఘట్టాన్ని అద్భుతంగా నిర్వహించారు,ఆయుధ పూజ అనంతరం దుర్గామాతను ఊరేగింపుతో తీసుకువెళ్లి కెనాల్ లో గురువారం రాత్రి 10 గంటలకు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని భవాని దీక్షపరులు నిమజ్జనం చేశారు,