కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూరల్ డి.ఎస్.పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల్ని విడివిడిగా విచారించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల పై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు