మోత్కూర్: పండుగ సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా? ఇంటి భద్రత కోసం మోత్కూర్ పోలీసుల కీలక సూచనలు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోత్కూర్ పోలీసులు సూచనలు చేశారు. విలువైన వస్తువులను భద్రపరచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు 112 లేదా స్థానిక నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.