రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. యూరియా పై బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. ఈ విషయమై పలువురు అధికారులను ఫోన్లో మాట్లాడి చర్చించారు.