అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలు భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇళ్ళముందు కల్లాపు జల్లి ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టారు. సంస్కృతీ సంప్రదాయాల పండుగైన సంక్రాంతికి పెద్ద పీట వేస్తూ గ్రామాల్లో వేకువజాము నుంచి నూతన దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్ళి పూజలు చేశారు. గుంతకల్లు మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, గుత్తి మండలం తొండపాడు రంగనాథస్వామి ఆలయం కిటకిటలడాయి.