బీసీ సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కర్నూలు ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. కర్నూల్లో ఆయన కార్యాలయంలో ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు ఎంపీ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. చట్టసభల్లో బీసీలందరూ ప్రాతినిధ్యం వహించాలన్నారు. దేశంలో బీసీ బిల్లును సాధించుకుంటామన్నారు. బీసీ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.