శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టులో ప్రభుత్వ ఖాళి స్థలాల్లో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని క్వార్టర్స్, ఖాళీ స్థలాల్లో ఉన్న అనధికారిక ఆక్రమణలను వెంటనే తొలగించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ,హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం వహించకుండా, పక్కా ప్రణాళికతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు