సమిశ్రగూడెంలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు, 10లీటర్ల నాటుసారా స్వాధీనం
నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. పాతాళ సుజన్‌రావు అనే వ్యక్తి సారా విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి 10లీటర్ల సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు.