గుంతకల్లు: పట్టణంలోని అంజలీ నగర్ లో రెండిళ్లలో చోరీ, 2.5తులాల బంగారు, 20 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అంజలీ నగర్ లో రెండిళ్లలో చోరీ జరిగింది. తలుపులు తెరుచుకున్న గుర్తు తెలియని దొంగ ఇళ్లలోకి ప్రవేశించి బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. గురువారం బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని కసాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని అంజలీ నగర్ లో నివాసం ఉండే పార్వతి అనే ఇంటి తలుపులు వేసుకుని ఇంట్లో నిద్రిస్తోంది. అయితే ఓ గుర్తు తెలియని దొంగ మొహానికి మాస్క్ ధరించి, చేతులకు గ్లౌస్ లు వేసుకుని బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న పార్వతి బెడ్ రూమ్ తలుపులకు గడి వేసి ఇంట్లో చోరీ చేశాడు.