చెన్నూరు: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
చెన్నూర్ నియోజకవర్గంలో నిర్వహించిన "అప్పుడే మంచిగుండే" కార్యక్రమంలో ప్రజల నుంచి సేకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.