పలమనేరు: పట్టణం నందు PKM UDA చైర్ పర్సస్ డా. B.R.సురేష్ బాబు పర్యటించారు. ఆయనకు సాదర స్వాగతం పలికి ఆయన ఆధ్వర్యములో పలమనేరు పరిధి లోని అనథరైజ్డ్ లేఔట్ రెగులైజేషన్ స్కీం (LRS) బిల్డింగ్, పెనలైజేషన్ స్కీం (BPS)కు సంబంధించి ఎమ్మార్వో, ఎంపీడీవో, మునిసిపల్ కమీషనర్ తో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కిరణ్ కుమార్ మరియు సునీత నాగరాజు, పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తాసిల్దార్ ఇన్బానాధన్ తదితర అధికారులు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.