నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌లో ఘనంగా ఉర్సు షరీఫ్ వేడుకలు: పూర్తి వివరాలు ఇవే!
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, చిస్తీ నగర్లో ఈ నెల 8, 9 తేదీల్లో హజ్రత్ ఖ్వాజా షా సయ్యద్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ చిస్తీ వార్షిక ఉర్సు షరీఫ్ వేడుకలు జరగనున్నాయి. ఖవ్వాలి, అన్నదానం, గంధాల కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.