శ్రీకాకుళం: అయోడైజ్డ్ ఉప్పు వాడండి: శ్రీకాకుళం డీఎంహెచ్వో కీలక సూచనలు
అయోడిన్ లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది. వంటలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం, నిల్వ చేసే పద్ధతులపై డీఎంహెచ్వో నరేష్ కుమార్ సూచనలు చేశారు. ఈ నెల 27 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు జరుగుతాయి.