మర్రివాడ గ్రామ సచివాలయంలో ఖాళీలు భర్తీ చేయాలని సచివాలయం ఎదుట నిరసన తెలిపిన స్థానిక పెద్దలు, గ్రామస్తులు
కొయ్యూరు మండలంలోని మర్రివాడ గ్రామ సచివాలయంలో ఖాళీలను భర్తీ చేయాలని నీటి సంఘం అధ్యక్షులు దేముడు, మాజీ సర్పంచ్ తాతారావు, గ్రామ పెద్దలు బాబూరావు, బాలరాజు పలువురు గ్రామస్తులు కోరారు. శనివారం సాయంత్రం సచివాలయ ఎదుట నిరసన తెలిపారు. సచివాలయ డిజిటల్, వెల్ఫేర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు బదిలీ అయి నెలలు గడుస్తున్నాయన్నారు. ఇప్పటికీ ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.