ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని డాక్టర్ శ్రీలేఖ తెలిపారు.
నందవరం మండలంలో విజృంభిస్తున్న విషజ్వరాలు.. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వందల మంది వైరల్ ఫీవర్తో వస్తున్నారని చెప్పారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో మురుగు కాల్వలు శుభ్రం కాక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.