ఆత్మకూరు: చంద్రఘాడ్ కోట పర్యటకానికి మోక్షంమే ఎన్నడో....
పర్యాటకం అంటే పాలమూరు ప్రాచీన ఆలయాలు నదుల గలగలలు .... ఇక ఖిల్లా లకు అయితే కొదువే లేదు కోట కోటకో చరిత్ర అందులో అమరచిOత మండలం లోని చంద్రఘడ్ కోట రాజా షా న్ని చూసి తీరాల్సిందే...... అలంత దూరం నుంచే దర్భంగా నిలబడిన యుద్ధ వీరు డిలా కనిపిస్తుంది చంద్రఘడ్ కోట జూరాల ప్రాజెక్టు వెళ్ళేదారిలో కుడిపక్కకు అమరచింత మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎత్తే న కొండపై నిర్మించారు కోటా ద్వారం వద్ద నిలబడి చూస్తే జూరాల ప్రాజెక్టు కనువిందు చేస్తుంది పచ్చటి పొలాలు ప్రకృతి సౌందర్యాలను చాటి చెబుతా యి సుదూరంగా కనిపించే గ్రామాలు చెరువులు మనస్సుని కట్టి పడేస్తాయి......