నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, 11 మంది అరెస్ట్
నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్సై రజియా సుల్తానా ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.46,330 లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు.