పేదలకు ఇళ్ల పట్టాల మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో హిందూపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
హిందూపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేసి, సిపిఎం కాలోనిలో గుడిసెలను వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలను మంజూరు చేయాలని సిపిఎం జిల్లా నాయకు లు ప్రవీణ్ కుమార్ డిమెండ్ చేశారు. అంబేద్కర్ నగర్, రహమత్ పురం, ఇందిరమ్మ కాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాలకు చెందిన నిలువ నీడలేని నిరుపేదలు వారి సొంతింటి కలను నెరవేర్చాలని కోరుతూ నచివాలయాలు, రెవిన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకు న్నారు.