శాంతిపురం మండలంలోని శివపురం వద్ద సీఎం ఇంటి ఎదుట తమకు 1.20 సెంట్ల భూమి ఉందని కదిరిఓబనపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే సైనికుడు శనివారం పేర్కొన్నారు. తమకు చెందిన భూమినీ సుందరప్ప అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని వాపోయారు. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమ భూమిని ఆక్రమించుకున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.