కనగల్: కురంపల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, కురంపల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నిర్మించిన వైకుంఠధామాన్ని శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం వైకుంఠధామాలను అసంపూర్తిగా నిర్మించి వదిలేసిందని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మౌలిక వసతులతో నూతనంగా వైకుంఠధామాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.