ఇబ్రహీంపట్నం: తిరుమల లడ్డు వివాదంపై బోరబండ పోలీస్ స్టేషన్ లో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు
తిరుమలలో లడ్డు వివాదంపై బోరబండ పోలీస్ స్టేషన్ లో బోరబండ డివిజన్ బిజెపి అధ్యక్షుడు వెంకటేష్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కోట్లాదిమంది భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమల ప్రసాదం లడ్డూను స్వీకరిస్తారని తెలిపారు. అలాంటి లడ్డులో జంతువుల కొవ్వు కలపడం దారుణమని ఇది హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.