ఆత్మకూరు పట్టణ శివారులో అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి బోల్తా పడ్డ ట్రాక్టర్, డ్రైవర్ కు స్వల్ప గాయలు,
ఆత్మకూరు పట్టణ శివారులో గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకవెళ్ళి బోల్తా పడింది,ఈ ఘటనలో డ్రైవర్ అంజికి స్వల్ప గాయాలు కాగా,అతనిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఎర్రగుడూరు గ్రామానికి చెందిన అంజి ట్రాక్టర్ తీసుకొని ఆత్మకూరు కు రిపేరుకు వస్తుండగా నేషనల్ హైవే అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అక్కడే పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది, దీంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి, ప్రాణాపాయ ముప్పు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు, క్రెన్ సహాయంతో ట్రాక్టర్ బయటికి తీశారు,