పలమనేరు: రూరల్ మండలం మండిపేట కోటూరు గ్రామస్తులు మంగళవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. నేడు గ్రామంలో మైలేరు పండుగ నిర్వహించడం జరిగింది. ఇందులో స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యధికంగా పాల్గొని ఎద్దులను తరిమి కేరింతల కొడుతూ హుషారుగా పాల్గొన్నారు. ఒకానొక సందర్భంలో ఓ ఎద్దు జనాల పైన దూసుకెళ్లింది అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం లేదని గ్రామస్తులు తెలిపారు. గతంలో మైలేరు పండుగలు జరిగినప్పుడు పలు సందర్భాల్లో ఎద్దుల తాకిడికి పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు,వాటిని దృష్టిలో పెట్టుకొని మైలేరు నిర్వహించేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.