ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మిగనూరు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బంది నిర్వహించారు. గర్భిణులకు వివిధ రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. టీడీపీ 7వ వార్డు నాయకుడు సూరి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.