సంగారెడ్డి: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల బకాయిలు చెల్లించాలి, తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల బకాయిలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం వద్ద బుధవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. లేనియెడల ఉద్యమం చేపడదామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయికిరణ్, నాయకులు భాను ప్రకాష్, అనిల్, కృష్ణ, నర్సింలు పాల్గొన్నారు.