అనకాపల్లిలో తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. రైల్వే గూడ్స్ రోడ్డు ఇంద్రజ్యమ్ను మందిరం నుంచి తిరుగు రథయాత్ర ప్రారంభించారు. జూన్ 27న గవరపాలెం అగ్గిమర్రి చెట్టు నుంచి స్వామి వారి విగ్రహాలను రథయాత్ర చేసి ఇంద్రజ్యమ్ను మందిరానికి చేర్చారు. 10 రోజులు పాటు అక్కడ పూజలు చేశారు.