జగిత్యాల: జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ప్రజల పక్షాన సాయన్న గారు చేసిన పోరాటాలను, ఆయన ఆశయాలను గుర్తు చేశారు.