శ్రీశైలం: మున్సిపల్ వర్కర్స్‌కు సంబంధించిన పెండింగ్ ఈపీఎఫ్ అమౌంట్‌ను వెంటనే జమ చేయాలి: ఆత్మకూరు మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ వర్కర్స్‌కు సంబంధించిన పెండింగ్ ఈపీఎఫ్ అమౌంట్‌ను వెంటనే జమ చేయాలని వర్కర్స్ డిమాండ్ చేశారు. 2018 సంవత్సరం నుంచి APCOSలో విలీనం అయ్యే వరకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ మొత్తాన్ని అధికారులు ఇప్పటివరకు జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 మంది వర్కర్స్ మరణించగా, పెండింగ్ ఈపీఎఫ్ అమౌంట్ ఖాతాల్లో జమ కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఈపీఎఫ్ కార్యాలయం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదని తెలిపారు. వెంటనే పెండింగ్ మొత్తాన్ని సంబంధిత ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని వారు కోరారు.అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని మేనేజర్‌ను కోరారు.