వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా లబ్ధిదారులతో వారి సమస్యలు, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 48 మంది లబ్ధిదారులకు 51,06,083 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు అనారోగ్యంతో బాధపడకూడదు అని సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు అందరికీ సహాయం చేసి ఆదుకుంటున్నాడని ఆయన తెలియజేశారు,