విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి మంచి ఫలితాలు సాధించాలని డీఈవో జనార్దన్ రెడ్డి అన్నారు,మహానంది మండలం గాజులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు,పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ, ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు అన్నారు,ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన వారికి మంచి విద్యను అందించాలన్నారు, అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు 100% పూర్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.