హత్నూర: మద్దతు ధర కోసం పత్తి రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలి : వ్యవసాయ మార్కెటింగ్ సంయుక్త సంచాలకులు ఈ మల్లేశం
మద్దతు ధర కోసం పత్తి రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని వ్యవసాయం మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు ఈ మల్లేశం అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పత్తి రైతులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి మద్దతు ధర 8110 ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో పూర్తి వివరాలను నమోదు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు.