హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న కళ్ళు డిపోలలో మరియు కళ్ళు దుకాణాలలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిన అధికారులు
ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్, హిందూపురం స్టేషన్ పరిధిలో గల పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మరియు హిందూపూర్ పట్టణములో ఉన్న కల్లు డిపో, లేపాక్షి మండలం పూలమతి గ్రామంలో గల కల్లు డిపో లలో. మరికొన్ని కల్లు దుకాణల నుండి కల్లు శాంపిల్స్ సేకరించి చిత్తూరు కెమికల్ ల్యాబ్ కు పంపించినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. కల్తీ కల్లు అరికట్టేలా కల్లు అమ్మకదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, కల్తీ కల్లు విక్రయ దారుల మీద పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని, అలాగే కల్లు తాగే వారికీ అవగాహన కల్పించి, కల్లు తాగడం వలన జీర్ణవ్యవస్థ మీద వాటి ప్రభావం, కల్లు మీద ప్రజలకు అవగాహన కల్పించారు.