విశాఖపట్నం: విశాఖ డాబా గార్డెన్స్ వద్ద ఓ పోలీస్ వాహనము నిలిచిపోవడంతో అవస్థలు పడిన వాహనదారులు ప్రయాణికులు.
విశాఖ డాబా గార్డెన్స్ వద్ద గురువారం సాయంత్రం ఓ పోలీస్ వాహనము ఒక్కసారిగా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విశాఖ పోలీస్ డైరెక్షన్ నుంచి వస్తున్న ఈ వాహనము ఒకసారిగా మరాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు వాహనానికి మరమ్మత్తులు గావించి వాహనం అక్కడ నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు ఈ క్రమంలో ట్రాఫిక్కును పోలీసులు క్రమబద్ధీకరించారు. వాహనం నిలిచిపోవడంతో సుమారు 20 నిమిషాల పైగా ట్రాఫిక్ స్తంభించుకోవడంతో వాహనదారులు అవస్థలు పాలయ్యారు