పార్వతీపురం: పార్వతీపురంలో జియో టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన: అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
పార్వతీపురం బెలగాం జనావాసాల మధ్య చేపట్టిన జియో టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ స్థానిక అపార్ట్మెంట్ యజమానులు జిల్లా అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన డిఆర్ఓ విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.