శ్రీశైలం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాలి. కార్యకర్తలతో MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి
గ్రామాల అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ–అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఈమేరకు శుక్రవారం వేల్పనూరు నందు పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అధికారులు, కూటమి నాయకత్వం సమిష్టిగా సంక్షేమం, అభివృద్ధి పనులను వేగవంతం చెయ్యాలని సూచించారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థులు గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు.