అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రబోధానంద స్వామి మహిళ భక్తులు పాడే మోసి మనుషులంతా ఒక్కటే ఎలాంటి తారతమ్యాలు లేవని నిరూపించారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణానికి చెందిన ప్రబోధానంద స్వామి భక్తుడు మృతి చెందాడు. అయితే అతడి మృతదేహానికి ప్రబోదానంద స్వామి శిష్యులు సుమారు వంద మంది పాడే మోసి మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పారు. అందులో మరో విశేషమేమిటంటే మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని పాడే మోసి శ్మశాన వాటికకు వెళ్ళారు. పట్టణంలో మహిళలు పాడే మోస్తూ మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలను పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.