బనగానపల్లె: కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిని వెంటనే తొలగించాలని బనగానపల్లెలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో బనగానపల్లెలోని గాంధీ విగ్రహం ముందు నల్ల కండువాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శివయ్య మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి పలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు