తెలంగాణ నుంచి మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 306 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన నందిగామ సీఐ హనీష్
Nandigama, NTR | Apr 25, 2024 తెలంగాణ నుంచి మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 306 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ సీఐ హనీష్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు. మద్యం తర లిస్తున్నట్లు సీఐకి వచ్చిన సమా చారం మేరకు ఎస్సై దుర్గామహే శ్వరరావు, సిబ్బంది వెళ్లి నిఘా ఉంచారు. వ్యాన్లో మద్యం తర లిస్తుండగా ఎస్సై, కానిస్టేబుల్స్ మధు, రమేష్ వెంబడించి పట్టు కున్నారు. మద్యం స్వాధీనం చేసుకున్నారు. నందిగామకు చెందిన మాడుగుల శాంసన్, షేక్ గౌస్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.