సూళ్లురుపేట: నాదెండ్ల వారి కండ్రిగలో పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాయతీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించి గ్రామస్థులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళిక బద్ధంగా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. సూళ్లూరుపేటలో మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఏనాడు శిలాఫలకాలపై ప్రచురించే పేర్లు విషయంలో