శ్రీశైలం: మహానంది మండలం బొల్లవరం గ్రామంలో కొండచిలువ కలకలం, బంధించి అడవిలో వదిలిన స్నేక్ క్యాచర్ మోహన్
నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామంలో కొండచిలువ సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ చేస్తున్న శబ్దాలు వినిపించడంతో వారు వెంటనే అప్రమత్తమై గ్రామస్థులకు సమాచారం అందించారు.గ్రామస్థులు స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన ఘటనాస్థలానికి చేరుకుని చాకచక్యంగా సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.