దసరా మండపాలకు అనుమతులు తప్పనిసరి: పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్
శాంతి భద్రతలకు భంగం కలగకుండా దసరా పండుగను జరుపుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం రాత్రి ప్రజలకు సూచించారు. దసరా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్ లు ఉపయోగించకూడదన్నారు. నిబంధనలు పాటిస్తూ, పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.