హిందూపురం తహసిల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమావేశం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం తహసిల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ లిస్ట్ అప్డేషన్, కొత్త పోలింగ్ బూత్ల ఏర్పాటు గురించి చర్చించారు,అక్టోబర్ నెలలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలు కాబోతున్నది బూత్ లెవెల్ అధికారులు వారి వారి పరిది లోని ప్రతిఒక్క ఇంటిని విసిట్ చేసి ఓటర్ లిస్ట్ రెడీ చేయడము జరుగును. బూత్ లెవెల్ అధికారి తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా తప్పని సరిగా విచారణ లో ఖచ్చితము గా పాల్కొని సహకరించాలన్నారు.